గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

5న ఐలు జాతీయ మహాసభ సన్నాహక సదస్సు

1 గంట క్రితం

ailu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 08:31 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- పోస్టర్‌‌ను ఆవిష్కరించిన నేతలు

- విజయవాడ కోర్టు ప్రాంగణంలో విస్తృత ప్రచారం

​ప్రజాశక్తి - విజయవాడ : ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జాతీయ మహాసభ సన్నాహాల్లో భాగంగా ఈనెల ఐదవ తేదీ ఉదయం పది గంటలకు ‘అసమ్మతి తెలిపే హక్కుపై అణచివేత - భారత రాజ్యాంగం ఏం చెబుతోంది’ (సప్రెషన్‌ ఆఫ్‌ ‌ది రైట్‌ ‌టు డిసెంట్‌ అండ్‌ ‌ది కానిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇండియా) అన్న అంశంపై జరిగే సదస్సు పోస్టర్‌ ఆవిష్కరణ బుధవారం జరిగింది. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబివికె)లో ఐలు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన జరిగే ఈ సదస్సులో ముఖ్య వక్తగా మాజీ జాతీయ జుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌, జాతీయ కోర్టు (సుప్రీంకోర్టు) మేనేజ్‌‌మెంట్‌ సిస్టమ్ ఫౌండర్ చైర్మన్, జాతీయ లా స్కూల్ (బెంగళూరు) మాజీ డైరెక్టర్, మాజీ వైస్ ఛాన్సలర్, మాజీ రాజ్యసభ సభ్యులు ప్రొఫెసర్ జి.మోహన్ గోపాల్ ప్రసంగించనున్నారు. ఐలు జాతీయ అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు బికాస్ రంజన్ భట్టాచార్య, ఐలు జాతీయ ప్రధాన కార్యదర్శి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పి.వి.సురేంద్రనాథ్, ఐలు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎపి బార్‌ ‌కౌన్సిల్‌ ‌సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్, ఐలు జాతీయ ఉపాధ్యక్షులు కె.ఇలంగో, కొల్లి సత్యనారాయణ, ఐలు తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె. పార్థసారథి తదితరులు పాల్గొంటారు. సదస్సు సందర్భంగా ఐలు జాతీయ మహాసభ ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నారు.

బెజవాడ బార్‌ అసోసియేషన్‌ (‌బిబిఎ) హాలులో జరిగిన పోస్టర్‌ ఆవిష్కరణలో ఐలు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్‌, జాతీయ కౌన్సిల్‌ ‌సభ్యులు సప్పా రమేష్‌‌బాబు, బిబిఎ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విష్ణుబొట్ల లక్ష్మీనారాయణ, వి.కిరణ్‌, సీనియర్ న్యాయవాదులు చేకూరి శ్రీపతిరావు, పి.గౌతం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సదస్సు విజయవంతం కావాలని కోరుతూ ఐలు నాయకులు వి.కోటేశ్వరరావు, వి.రాజారత్నం, ఎ.సుధాకర్ రావు, వి.రామకృష్ణ, సి.వి.సుబ్రహ్మణ్యేశ్వర రావు, బి.రవి తదితరులు కోర్టు ప్రాంగణంలో ప్రచారం చేశారు. న్యాయవాదులు, నగర ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్