ప్రజాశక్తి - విజయవాడ : మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణ ఉపసంహరించి మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సిఫార్సు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి లేఖలు వ్రాయాలని కోరుతూ గురువారం సి ఆర్ డి ఏ లో కమీషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ పి సంపత్ కుమార్ ను ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి ఎస్ జ్యోతి బసులు వినతిపత్రం అందజేశారు. సచివాలయం లో మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ మరియు ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్ సురేష్ కుమార్ లు అందుబాటులో లేకపోవడం వల్ల వారి ఫేషియలలో వినతిపత్రాలు అందించడం జరిగింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల నుండి సేకరించిన సంతకాల కట్టలను ఈనెల 22వ తేదీ విజయవాడ లో మంత్రి డాక్టర్ పి నారాయణ గారికి అందజేస్తన్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం డి ఎం ఏ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మున్సిపల్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, పిల్లలకు ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు అమలు, హెల్త్ కార్డులు తది్తర సమస్యలు పరిష్కరించాలని నాయకత్వం కోరింది. ఈ సందర్భంగా డిఎంఏ డాక్టర్ పి సంపత్ కుమార్ మాట్లాడుతూ కార్మికుల కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి
15 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 18, 2026, 09:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)