బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆర్థికాభివృద్ధి కేంద్రంగా అమరావతి : సిఎం చంద్రబాబు

1 గంట క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 11:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలొచ్చి నివసించేలా రాజధాని అమరావతి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి-2.0 ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రూపకల్పన పనుల పురోగతిపై అధికారులు, సింగపూర్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా సింగపూర్ ప్రతినిధులు ప్రాజెక్టు పరిధి, అమలు ప్రణాళిక, దశలవారీ కార్యాచరణను ముఖ్యమంత్రికి వివరించారు. ఏరియా ప్లాన్, మౌలిక వసతుల ప్రణాళిక, పెట్టుబడి నమూనా వంటి అంశాలను ప్రాజెక్టులో భాగం చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం సిఎం మాట్లాడుతూ.. ఉద్యోగాలు కల్పించేలా అమరావతి ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని సూచించారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లతో అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మిస్తున్నామని, ఎల్‌నినోతో సమస్య తలెత్తినా... పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా నదికి తీసుకురావడంతో రాజధాని ప్రాంతం జల వనరులతో కళకళలాడుతోందని చెప్పారు. అమరావతిని ఆర్థికంగా బలోపేతం చేసేలా క్రియేటివ్ సిటీ నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. గ్లోబల్ బెంచ్ మార్కింగ్ చేరుకోవడం, అత్యధిక తలసరి ఆదాయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వివరించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ బిల్డింగ్ విధానంతో పర్యావరణ అనుకూల విధానాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమీక్షకు మంత్రి పి నారాయణ, పురపాలక, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శులు సురేశ్ కుమార్, పీయూష్ కుమార్ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్