బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅమరావతి రాష్ట్ర ఆత్మగౌరవం

05 ఆగస్టు, 2026

amaravathi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 10:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రాజధానిలో పర్యటించిన మంత్రులు అనిత, నారాయణ, శ్రీనివాస్‌

ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు జిల్లా) : ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం అమరావతిలో కనిపిస్తోందని, రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఆమెతోపాటు మున్సిపల్‌ ‌శాఖ మంత్రి పి.నారాయణ, ఎంఎస్ఎంఇ శాఖల మంత్రులు పి.నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ రాజధానిలో బుధవారం పర్యటించారు. మంత్రుల బంగ్లాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను పరిశీలించారు. అమరావతి నిర్మాణ పనుల వివరాలను తోటి మంత్రులకు మంత్రి నారాయణ వివరించారు. అనంతరం అనిత మాట్లాడుతూ... రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనే విషయం అమరావతిని చూస్తే అర్థమవుతోందని, కొంతమంది మావిగన్ అని బుద్ధిలేకుండా మాట్లాడుతున్నారని, వైసిపి నాయకులు అమరావతికి వస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని అన్నారు. అమరావతి అభివృద్ధిని ప్రజలంతా చూడాలని కోరారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి సిఎం చంద్రబాబు ఓ ప్రణాళికతో ముందుకెళ్తున్నారన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాల నిర్మాణాలు పూర్తయ్యాయని, త్వరలోనే ఇతర భవనాలు కూడా పూర్తవుతాయని, భావితరాలకు మంచి భవిష్యత్తు ఉండేలా అమరావతి నిర్మితవుతోందని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్