బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సాజిద్ ఖాన్ ను ఎన్కౌంటర్ చేయాలంటూ ద్రాక్షారామలో నిరసన ప్రదర్శన

1 గంట క్రితం

Protest demonstration in Draksharamam demanding an encounter killing of Sajid Khan.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 03:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : పిఠాపురంలో ఏఈ నూకరాజు కుటుంబాన్ని సామూహికంగా అంతం చేసేందుకు పధకం రచించి ఆ కుటుంబం మొత్తం మరణాలకు కారణమైన సాజిద్ ఖాన్ అనే వ్యక్తిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని ద్రాక్షారామకు చెందిన పలువురు ప్రజాస్వామ్యవాదులు, నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అమాయక కుటుంబాలను బలి చేస్తున్న సాజిత్ ఖాన్ వంటి వారిని కఠినంగా శిక్షించాలని, సాజిద్ ఖాన్ ఉరితీయాలని నినాదాలు చేశారు. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి మెయిన్ రోడ్డు మీదుగా పోలీస్ స్టేషన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏఈ నూకరాజు కుటుంబంలో మిగిలిన వారికి రక్షణ కల్పించాలని, హిందూ కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సాజిత్ ఖాన్ వంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ మేరకు ద్రాక్షారమ ఎస్ఐ లక్ష్మణ్ కు వినతిపత్రం అందజేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్