న్యూఢిల్లీ : మహిళా హక్కుల కార్యకర్త, ఐద్వా నేత సోన్యా గిల్ (70) మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ముంబయిలో కన్ను మూశారు. ఆమె భర్త, ప్రముఖ జర్నలిస్టు పి. సాయినాథ్. ఆమె ఐద్వా కేంద్ర కార్యనిర్వహణా కమిటీ సభ్యులుగా, మహారాష్ట్ర రాష్ట్ర కార్యదర్శిగానూ పని చేశారు. క్షేత్రస్థాయిలో సంఘాన్ని విస్తరించడానికి ఎంతగానో కృషి చేశారు. ముంబయిలోని వర్లీ బిడిడి చావ్లాస్, జిజామాతా నగర్, డెలిసెల్ రోడ్ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల ను వెలుగులోకి తీసుకొచ్చారు. సోన్యా గిల్ మృతిపై ఐద్వా సంతాపం వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ప్రగాడ సానుభూతి తెలిపింది. దీర్ఘకాలిక అనారోగ్యంతో పోరాడుతున్నప్పటికీ, ఆమె చివరి క్షణం వరకు ఐద్వా కార్యకలాపాలలో పాల్గొంటూనే ఉన్నారని గుర్తు చేసుకుంది. ఆమె తన అనారోగ్యాన్ని అసా ధారణ ధైర్యంతో ఎదుర్కొన్నారని, ఉద్యమం పట్ల తనకున్న నిబద్ధతకు తన వ్యక్తిగత కష్టాలను అడ్డు గా పెట్టుకోలేదని ఐద్వా తన ప్రకటనలో పేర్కొంది.
Print Editionఐద్వా నేత సోన్యా గిల్ కన్నుమూత
26 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 26, 2026, 02:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)