న్యూఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) పిలుపునిచ్చిన ఢిల్లీ మార్చ్‌కు అఖిల భారత విద్యార్థి సంఘం (ఎఐఎస్‌ఎ) మద్దతు ప్రకటించింది. కేసులను ఉపసంహరించుకుంటామని కేంద్ర ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చినప్పటికీ విద్యార్థులపై కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని ఎఐఎస్‌ఎ అధ్యక్షురాలు నేహా బోరా బుధవారం ప్రకటించారు. ప్రభుత్వం అన్ని కేసులను పూర్తిగా ఉపసంహరించుకోవాలని, పెల్లెట్లు, బుల్లెట్ల కాల్పులపై విచారణ చేపట్టాలని, అలాగే దీనికి బాధ్యత వహించడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్చలకు దిగిరాకపోవడంతోనే ఈ నిరసనలు అనివార్యమయ్యాయని అన్నారు. ప్రజల చర్చలకు నిరాకరిస్తున్న ఈ ప్రభుత్వం నుండి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసే ఏ ప్రజాస్వామ్య, లౌకిక, ప్రగతిశీల ఉద్యమానికైనా లేదా నిరసనకైనా తాము మద్దతు ఇస్తామని బోరా స్పష్టం చేశారు. హక్కులు, జవాబుదారీతనం కోరుతూ జరిగే ప్రతి నిరసనకు తమ సంఘీభావం, మద్దతు ఉంటుందని అన్నారు. విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలని, పెల్లెట్, బుల్లెట్ కాల్పులపై దర్యాప్తు చేపట్టాలన్న డిమాండ్లపై సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుండి ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు సిజెపి ప్రకటించిన సంగతి తెలిసిందే.
‘ సెప్టెంబర్ 5’ సిజెపి ఢిల్లీ మార్చ్‌కు మద్దతు ప్రకటించిన ఎఐఎస్‌ఎ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 26, 2026, 03:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)