- ఓటు పరిరక్షణ వేదిక కన్వీనర్ సుంకర రాజేంద్రప్రసాదు
భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తన తాబేదారుగా ఉండేవారిని పెట్టుకునేందుకు వీలుగా బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ ఎన్నిక చట్టంలో సవరణ చేసింది. పర్యవసానాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. గత పది నెలలుగా ఎస్‌ఐఆర్ పేరుతో జరుగుతున్న ఘటనలు దేశం మొత్తం చూస్తోంది. భారతదేశం వంటి ప్రజాస్వామ్యయుత దేశంలో ఉన్నప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇతర కమిషనర్లతో సంప్రదించకుండా వాళ్ల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఏకపక్షంగా నియంతృత్వంగా తీసుకుంటున్న అనేక నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి ఆయన తాబేదారులాగా ప్రవర్తిస్తున్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈయన నియమామకం 2023 లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కావాలని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జరిగేటువంటి నిష్పక్షపాత కమిటీ అనగా ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో ఉన్న కమిటీ సిఈసిని నియమించేంది. అనంతరం బిజెపి ప్రభుత్వం కమిటీలో నుండి చీఫ్ జస్టిస్‌ను తొలగించింది. మరో కేంద్ర మంత్రిని నియమించుకునేలా దుర్మార్గమైనటువంటి చట్టాన్ని చేసుకుంది. దీని ద్వారా ఎన్నికల కమిషనర్ నియమామకంలో వాళ్ళ మార్గాన్ని సుగమం చేసుకున్నారు. తద్వారా ఏర్పడినటువంటి కమిషనర్ మిగతా కమిషనర్లకు అభిప్రాయాలకి భిన్నంగా వ్యవహరించారు. మిగతా కమిషనర్లు కూడా ఈయనతో పాటు సమాన హోదా ఉంటుంది. సిఈసికి ప్రత్యేకంగా లేదా ఎక్కువ హోదా లేదనే విషయం కూడా మనందరికీ తెలుసు. ఆయినప్పటికీ జ్ఞానేశ్వర్‌కుమార్ కేంద్ర ప్రభుత్వ కనుసన్నలో మెలుగుతున్నారు. ఎస్‌ఐఆర్‌ను సామాన్య ఓటర్లు, మైనార్టీలు, క్రిస్టియన్లను టార్గెట్‌గా చేసుకుని నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే ఓటర్లను ఎన్నుకుంటుందనే విధంగా వ్యవహారం నడిపారు. అందుకని వెంటనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్‌కుమార్ రాజీనామా చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చట్టాన్ని మార్చి మరలా పాత చట్టాన్ని అమల్లోకి తేవాలి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఉండే కమిటీని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎన్నికల ప్రక్రియ అనేది భారత ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైనటువంటిది. దానికోసం ఎన్నికల కమిషన్ నియమామకం కూడా నిష్పక్షపాతంగా ఉండాలని ఎన్నికల ప్రక్రియ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా జరగకూడదనే ఉద్దేశంతోనే అత్యున్నత స్థాయిలో కమిటీని ఏర్పాటు చేశారు. 2023 ఎన్నికల కమిషనర్ ఎన్నిక చట్టంలో సవరణలపై సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేశారు. అది ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. కేంద్ర ప్రభుత్వం గాని భారతీయ జనతా పార్టీ గాని వాళ్ళ తాబేదారులని నియమించుకొని ఎన్నికలను, ప్రజాస్వామ్యా వ్యవస్థను తొత్తడం చేస్తోంది. దీర్ఘకాలం తామే అధికారంలో ఉండాలనేటువంటి దురుద్దేశంతో కేంద్రం ఇటువంటి చర్యలకు దిగుతోంది. కనుక ప్రజాస్వామిక వాదులంతా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది.







కామెంట్‌లు (0)