న్యూఢిల్లీ: 2026-27 రంజీట్రోఫీ విజేత జమ్ము-కాశ్మీర్‌తో ఇరానీ కప్‌లో తలపడే రెస్టాఫ్ ఇండియా జట్టును ప్రకటించారు. రెస్టాఫ్ ఇండియా కెప్టెన్‌గా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్, వైస్ కెప్టెన్‌గా సర్ఫరాజ్ ఖాన్ ఎంపికయ్యారు. వెస్టిండీస్‌తో టీమిండియా వన్డే, టి20 సిరీస్ మరియు ఆసియా క్రీడలు జరిగే సమయంలోనే ఇరానీ కప్ కూడా జరగనున్న క్రమంలో పలువురు సీనియర్ ఆటగాళ్లు ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు. రెస్టాఫ్ ఇండియా, జమ్ము-కాశ్మీర్ జట్ల మధ్య అక్టోబర్ 1 నుంచి 5 వరకు శ్రీనగర్ వేదికగా ఇరానీకప్ ఫైనల్ జరగనుంది.
జట్టు: పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), సాంఘ్వాన్, శిఖర్ మోహన్, సుదీప్ ఘరామీ, సర్ఫరాజ్ ఖాన్(వైస్ కెప్టెన్), స్మరణ్ రవిచంద్రన్, మానవ్ సుతార్, సురాన్ష్ జైన్, ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్, ముఖేష్ చౌదరి, ఆర్యన్ జైన్, ఆర్యన్ పాండే, అనుకుల్ రాయ్, ఆయుష్ డోషేజా.








కామెంట్‌లు (0)