ప్రజాశక్తి-అమరావతి : రామోజీరావు జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆర్థిక అవకతవకలు, పన్ను ఎగవేతలు, అక్రమ డిపాజిట్ల సేకరణ వంటి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి జయంతి వేడుకలకు ప్రజాధనం ఖర్చు చేయడం రాజ్యాంగ విరుద్ధమని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఈ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపున న్యాయవాది బుస్సా రాణా సందీప్ వాదనల కోసం గడువు కోరడంతో విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.
Print Editionరాష్ట్ర వేడుకగా రామోజీరావు జయంతి పట్ల మరో పిల్
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026, 07:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)