ప్రజాశక్తి-సూళ్లూరుపేట రూరల్ : తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న చింత సత్య హరినాథ్ శుక్రవారం మృతి చెందినట్లు సమాచారం. ఆయన షార్ ఉద్యోగులు నివసించే డీఆర్డీఎల్ కాలనీలో ఉంటున్నట్లు తెలిసింది. సాయంత్రం ఇంటి తలుపులు చాలా సేపు మూసి ఉండటాన్ని గమనించిన స్థానికులు తలుపులు తెరిచి లోపలికి వెళ్లగా, ఆయన మృతదేహం కనిపించినట్లు సమాచారం. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇది ఆత్మహత్యా, సహజ మరణమా, లేక ఇతర కారణాల వల్ల జరిగిందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు
అనుమానాస్పద స్థితిలో మరో షార్ ఉద్యోగి మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 26, 2026, 10:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)