mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

1.06 కోట్ల ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ

11 గంటల క్రితం

ap ceo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 01:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం


ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‌రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ వేగవంతమయినట్లు ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ ‌యాదవ్‌ ‌వెల్లడించారు. గురువారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.06 కోట్ల ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 4,16,27,693 మంది ఓటర్లకు అవసరమైన ఫారాలు 100 శాతం ముద్రించగా, వాటిలో 1,06,95,993 ఫారాలు ఇప్పటికే బూత్ స్థాయి అధికారుల ద్వారా పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే 1,89,220 ఫారాలు డిజిటలైజేషన్ చేసినట్లు వెల్లడించారు. ఫారాల పంపిణీలో కృష్ణా జిల్లా 59.74 శాతంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని, తదుపరి చిత్తూరు జిల్లా 43.90 శాతం, తిరుపతి జిల్లా 40.91 శాతం, వైఎస్సార్ కడప జిల్లా 36.35 శాతం, గుంటూరు జిల్లా 33.32 శాతంతో ముందు వరసలో నిలిచినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం కోసం 46,397 మంది బూత్ స్థాయి అధికారులు పనిచేస్తున్నారని, ఓటర్ల వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి, ఓటరు జాబితాలను మరింత పారదర్శకంగా రూపొందించడమే ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్