- రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి సత్యకుమార్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిలో అదనంగా వంద ఎంబిబిఎస్ సీట్లకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసి)లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్ఒపి)మంజూరు చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి అదనంగా కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75, నెల్లూరు ఎపిఎస్ఆర్ కళాశాలకు 25 ఎంబిబిఎస్ సీట్లు మంజూరయ్యాని పేర్కొన్నారు. రాష్ట్రానికి 100 అదనంగా ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ పెంపుతో ఎపిలో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, అధ్యాపక సిబ్బంది నియామకం, ఎన్‌ఎంసి ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టిన చర్యల ఫలితంగానే ఈ అనుమతులు లభించాయని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు.








కామెంట్‌లు (0)