ప్రజాశక్తి- గుత్తి
గేట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. అనంతపురంలోని జెఎన్‌టియులో ఈనెల 24, 25వ తేదీల్లో ఎపిఎస్ఎస్ డిసి, ఆర్ టిహెచ్ సహకారంతో ఇన్నోవేటర్స్ కాన్ క్లేవ్-2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా 200 కళాశాలలో నుంచి దాదాపు 3,000 మందికిపైగా విద్యార్థులు హాజరై ప్రతిభను కనబరిచారు. ఇందులో గేట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన దాదాపు 100 మంది విద్యార్థులు హ్యాకథాన్‌లు, స్టార్టప్ ఐడియా పిచింగ్ తదితర పోటీల్లో తమ ప్రతిభను చాటారు. గేట్స్ విద్యార్థుల భాగస్వామ్యంకు గుర్తింపుగా ప్రీస్టేజియస్ ఔట్ స్టాండింగ్ ఔట్ రిచ్ పార్టనర్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు.









కామెంట్‌లు (0)