సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తా - పాసి సుష్మిత

1 గంట క్రితం

ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తా
- పాసి సుష్మిత image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 06:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జివిఎంసి 4వ వార్డు పరిధి ఎగువపేట, నిడిగట్టు, జివి.అగ్రహారం తదితర ప్రాంతాల్లో కూటమి బలపరిచిన టిడిపి అభ్యర్థి పాసి సుస్మిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ అన్ని వర్గాల ప్రజలను కలుసుకొని తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 4వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంటా నూకరాజు, పాసి నర్సింగరావు, గొలగాని నరేంద్ర, పాసి త్రినాథ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్