సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్‌పై విస్కృత ప్రచారం : ఎస్పీ

1 గంట క్రితం

ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్‌పై విస్కృత ప్రచారం : ఎస్పీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 06:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అనంతపురం క్రైం

అవినీతి నిరోధక శాఖ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1064పై ప్రజలకు విస్కృత ప్రచారం కల్పించాలని ఎస్పీ జగదీష్ సూచించారు. సోమవారం నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ 1064 అవగాహన పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచాలు డిమాండ్ చేసినా, అవినీతికి పాల్పడిన ప్రజలు నిర్భయంగా ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. అవినీతి నిర్మూలనకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. అవినీతికి సంబంధించిన ఫిర్యాదుల కోసం 1064 టోల్ ఫ్రీ నెంబర్ తో పాటు, 9440440057 నెంబర్ కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎసిబి డిఎస్పి ప్రసాద్‌రెడ్డి, సీఐ హమీ‌ద్‌ఖాన్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్