సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌కు జిబిఆర్ విద్యార్థి ఎంపిక

1 గంట క్రితం

రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌కు జిబిఆర్ విద్యార్థి ఎంపిక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 07:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అనపర్తి

రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌కు స్థానిక జిబిఆర్ జూనియర్ కాలేజీ విద్యార్థి కర్రి కృష్ణ సాకేత్ రెడ్డి ఎంపికయ్యాడు. ఈ నెల 24న అంబాజీపేటలో జరిగిన ఎస్ జిఎఫ్ అండర్-17 క్రికెట్ సెలక్షన్స్ ట్రయల్స్‌లో సాకేత్ రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచి ఈ అవకాశాన్ని దక్కించుకున్నాడు. నవంబర్ 4, 5, 6 తేదీలలో మచిలీపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనున్న కృష్ణ సాకేత్ రెడ్డిని కళాశాల ప్రిన్సిపల్ పిఆర్ఎల్.స్వామి, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ తేతలి ఆదిరెడ్డి, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పెద్ద అబ్బాయి రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు ఎంవివి.రామారెడ్డి, డేవిడ్ రాజు, విజయ్ బర్న తదితరులు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్