సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భీమిలిలో అప్ అభ్యర్థులుగా తల్లి, కుమార్తె

1 గంట క్రితం

భీమిలిలో అప్ అభ్యర్థులుగా తల్లి, కుమార్తె image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 07:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జివిఎంసి ఒకటో జోన్ పరిధిలో ఉన్న 1వ వార్డు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా నిమ్మకాయల దుర్గా భవానీ, అదే పార్టీ నుంచి

3వ వార్డు అభ్యర్థిగా భవానీ తల్లి అమ్మాజీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తల్లి, కుమార్తెలు ఒకే పార్టీ నుంచి పోటీ చేస్తుండడంతో ఇదే విషయమై అంతటా చర్చించుకుంటున్నారు. అమ్మాజీ భీమిలి మున్సిపాలిటీగా ఉన్న కాలంలో కౌన్సిలర్‌గా ప‌నిచేసిన విషయం విధితమే. అమ్మాజీ కుమార్తె భవానీ బిఎస్‌‌సి చదివారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రస్తుత ఎన్నికల్లో వామపక్షాలు మద్దతు నిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న దుర్గా భవానీ, అమ్మాజీలను గెలిపించాలని పార్టీ భీమిలి ఇంచార్జి నిమ్మకాయల భాస్కర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్