ఆదివారం, 06 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆదోనిలో శానిటేషన్ కార్మికురాలిపై దారుణం

1 గంట క్రితం

fire.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 07:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కర్నూలు : కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బస్టాండులో శానిటేషన్ విధులు నిర్వహిస్తున్న నరసమ్మ అనే కాంట్రాక్ట్ కార్మికురాలిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ముందుగా ఆమె కళ్లలో కారం చల్లి.. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో నరసమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. సుమారు 75 శాతం కాలిన గాయాలతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రెండేళ్ల క్రితం భర్తను కోల్పోయిన నరసమ్మ.. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది. శానిటేషన్ విభాగంలో కాంట్రాక్ట్ కార్మికురాలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. తీవ్రంగా గాయపడిన నరసమ్మను స్థానికులు ప్రభుత్వాసప్రతికి తరలిచారు. ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి, ఘటనకు గల కారణాలను వెలుగులోకి తెచ్చేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్