సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకాలమేసిన కాటుకి

06 సెప్టెంబర్, 2026

e1dc0cb5d05ce72f1f8d595453408b94.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 07:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

గతకాలపు వాసనలన్నీ

గాయాలై సలుపుతున్నా...

చిరునవ్వు పులుముకొని

కాంతిలో నిశీధిని మోస్తున్నాను.


నీ తలపుల కిరణాలు

నన్ను తాకుతుంటే...

పొద్దు వాలినా...

ప్రొద్దుతిరుగుడు పువ్వునయ్యాను.


మనలో మొలచిన ఆశలన్నీ

మోడుబారిపోతుంటే...

నాకు నేనే సాంత్వనయ్యాను.


కాలమేసిన కాటుకి

విడివడిన మనం...

రైలు పట్టాల్లా

కలవని దూరంతో

రాజీ పడి బ్రతకడమే.


ప్రేమ చిగురించిన వేళనుంచే

చింతలన్నీ మన చెంత చేరాయి...

నైరాశ్యపు నీడలు కమ్ముకున్నా...


మనసు మోస్తున్న గాయాలకు_

మధుర జ్ఞాపకాల మలాము

రాసుకుంటున్నాను.

సుభాషిణి వడ్డెబోయిన

ఒంగోలు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్