ఎండ!
ఎవులో మీదనుండి
వొంపుతున్నట్టిగుంది
వర్రగుండ!
కొమ్మల చేతులెత్తి
నన్ను కొట్టొద్దని
చెట్టు కోటి దండాలు పెట్టినా
మనిషి గుండె కరగనందుకు
మనిషిని ఇప్పుడు ఎండ
ఏడిపించుతంది.
ఎండ!
కాలిపోతుంది
రచ్చ బండ!
పచ్చ జెండానై
మీ పరిసరాలను కాపాడి
వాన పాటకి వంత పాడతానని
కొండ ఎంత తలకొట్టుకున్నా
కొండల్ని_
సున్నుండల్లా_
నంచుకు తిన్నందుకు
మనిషిని ఇప్పుడు
ఎండ ఏడిపించుతుంది.
గాలాడక
ఎండ మల్లీశ్వరున్ని
ఏడుకుంటే ఏటి లాభం
వాన కురవడానికి_
ఒక దారి ఉండాలిగా
మొక్కో మోడో చెట్టో చేమో
కొండో_ పెండో వుండాలి
ఆకాశం పొదుముకడగటానికి
యిన్ని నీలు మరిగి ఆవిరవ్వలిగా
ఎండ!
పగిలిపోతుంది
కుండా మండా
ఈ ఏడాదికి
ఆకుమల్లైతే అనాసలు_
వచ్చి చనిపోయిన_
పసి పిల్లల్లా_
మడి తల్లి ఒడిలో ప్రాణాలు_
పోగొట్టుకున్నాయి
ఇప్పుడు వాన_
పడితే లాభమేటి_
పడకపోతే నష్టమేటి
ఈ ఏటికి
వానలు యింతే_
కుంటలు నిండవు
పంటలు పండవు
యెద్దు కదలదు
ఏరు పరిగెత్తదు
ఏటి సేత్తం కొడుకా
ఎండ పల్లు తిని
ఎలాగ బతుకుతాము.
చింతా అప్పల నాయుడు
9441713185








కామెంట్‌లు (0)