సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవేకువ కువకువలు

06 సెప్టెంబర్, 2026

d046b9a81cf4c5d92abe037e59d5615b.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 07:56 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఉషోదయ కిరణాలు

సుప్రభాత గీతాలు

శుభోదయ వందనాలు

అలుపుదీర్చు జానపదాలు

గోధూళివేళలో కెంజాయ వర్ణాలు

లేగదూడల పరుగుల అరుపులు

నండూరి ఎంకిపాటలు

అన్నమయ్య సంకీర్తనలు

త్యాగరాజ కీర్తనలు

జయదేవుని అష్టపదులు

అమృతం_ కురిసిన రాత్రులు

పంచతంత్ర కథలు తోలుబొమ్మలాటలు

వీధి నాటకాలు హరికథా కాలక్షేపాలు

భారత రామాయణ గాథలు

జాతీయాలు నానుడులు సామెతలు

పొడుపు కథలు

ఉగాదులు సంక్రాతులు

వేదాలు పురాణాలు ఇతిహాసాలు

సంస్కృతులు సాంప్రదాయాలు

నమస్కారాల సంస్కారాలు

పలుకబడులు పద్దతులు

పంచెకట్టు చీరకట్టుల అలంకరణలు

పెళ్ళిల్లల్లో బంతిభోజనాలు

వేదపండితుల ఆశీర్వచనాలు

గోంగూర నెయ్యి పిండివంటకాలు

రూకటి పచ్చళ్ళ రుచులు

పల్లె వారి వావి వరుసలు ప్రేమలు

తూనీగలతో ఆటలు

కోకిల కూజితాలకు బదిలిచ్చిన కూతలు

కొంగా కొంగా పాలుపొయ్యి అంటూ పాడి

గోళ్ళు చూసుకున్న బాల్యపు గురుతులు

మేకపొదుగులోని పచ్చిపాలు

ఆవులిచ్చిన జున్నుపాలు

పనసలు చెరుకులు కొమ్మతేనెలు

తంగేడుపూలు ఎలక్కాయలు నేరేడుపళ్ళు

ఏటిగట్టున పరుగులు చెరువులోని చేపలు

చిలకమ్మ పలుకులు కందిచేను కులుకులు

సెలయేటి పరవళ్ళు గుడిలోని జేగంటలు

మధుర స్వప్నాలు వెన్నెల రాత్రులు

మరచిపోతే ఎలా

తెలుగులోని తేనె చుక్కలు

మాతృభాష మధురం

తెలుగుభాష మధురాతిమధురం !

- సురేంద్ర రొడ్డ

9491523570

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్