సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionభూ మాఫియా బరితెగింపు

2 గంటల క్రితం

WhatsApp Image 2026-10-05 at 8.19.57 PM.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 12:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • డి. పట్టా భూముల్లో అక్రమ నిర్మాణాలు

  • వాస్తవాలను వెలికితీసిన ప్రజాశక్తి విలేకరిపై దాడి

ప్రజాశక్తి–కాకినాడ : డి.పట్టా భూముల్లో సాగుతున్న అక్రమ నిర్మాణాలపై వరుస కథనాలు రాసినందుకు ప్రజాశక్తి విలేకరి రమేష్‌పై భూమాఫియా విచక్షణారహితంగా దాడికి తెగబడింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామంలో కాకి అంతలక్ష్మి పేరుతో ఉన్న డి.పట్టా భూమిలో గోశాల నిర్మాణానికి పి.వేమవరానికి చెందిన మాగాపు గణపతి సిద్దమయ్యారు.

ఈ వ్యవహారంపై విలేకరి రమేష్‌ ఇటీవల పలు వార్తా కథనాలు రాశారు. దీంతో రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు పట్టించుకోకుండా తవ్వకాలు, నిర్మాణ పనులు యథావిధిగా చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రజాశక్తి సహోద్యోగి జి.ఇస్సాక్‌తో కలిసి రమేష్‌ సోమవారం ప్రత్తిపాడు నుంచి లంపకలోవకు వెళ్లారు. పనులు కొనసాగుతున్నట్లు గుర్తించిన రమేష్‌, తన మొబైల్‌ఫోన్‌లో ఫొటోలు తీశారు. పనులు చేపడుతున్న మాగపు గణపతి, కోర్ని ప్రకాష్‌, దాలే సతీష్‌, భారత్‌ రాఘవతో పాటు మరో వ్యక్తి రమేష్‌ వద్దకు వచ్చి ‘ఎందుకు ఫొటోలు తీస్తున్నావు?’ అంటూ ప్రశ్నించి, మొబైల్‌ఫోన్‌ను లాక్కొని దాడికి పాల్పడ్డారు. ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడిన రమేష్‌ను సిఐటియు మండల కార్యదర్శి రొంగల ఈశ్వరరావు పరామర్శించారు.

​సిపిఎం, ఎపిడబ్ల్యుజెఎఫ్ ఖండన

రమేష్‌పై దాడిని సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఎపిడబ్ల్యుజెఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాతాడ నవీన్ రాజ్, ముమ్మిడి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రమేష్ పై దాడి అత్యంత హేయమైన చర్య అని పత్తిపాడు ప్రింట్ మీడియా ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్