ప్రజాశక్తి - ఏలూరు స్పోర్ట్స్: ఏలూరు సమీపంలోని చోడిమెల్ల వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కల్యాణ మండపంలో ఫ్లవర్ డెకరేషన్ పనులు ముగించుకుని ఐదుగురు మహిళా కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళలను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే శ్రీదేవి (60) అనే వృద్ధురాలు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గాయపడిన మిగిలిన మహిళలకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరంతా ఏలూరుకు చెందిన మహిళా కూలీలుగా గుర్తించారు.
చోడిమెల్ల వద్ద ఆటో బోల్తా.. మహిళా కూలీ మృతి
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 29, 2026, 07:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)