మంగళవారం, 04 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్ధుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి

3 రోజుల క్రితం

savitha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 09:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మంత్రి సవిత

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వాతావరణంలో మార్పుల దృష్ట్యా బిసి వసతి గృహాలు, గురుకులాల విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆ శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. స్వల్ప అస్వస్థత గురై గుంటూరు బిసి వసతి గృహానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు కోలుకున్నా వారిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యేవేక్షిస్తుండాలని శుక్రవారం ఆదేశించారు. ఈ మేరకు మంత్రి.. గుంటూరు జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారులకు, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్‌కు సూచించారు. గుంటూరు నగరానికి చెందిన బిసి వసతి గృహం విద్యార్థినులు ఐరన్ మాత్రలు వేసుకోగా, వారిలో ముగ్గురు విద్యార్థినులకు మాత్రలు వికఠించి వాంతులు వచ్చేటట్లు, తల తిరిగినట్లు ఉండడంతో స్థానిక జిజిహెచ్‌‌కు తరలించారు. విషయం తెలుసుకున్నవెంటనే జిజిహెచ్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్‌తోనూ, జిల్లా బిసి సంక్షేమ శాఖాధికారి మయూరి, ఇతర అధికారులతోనూ మంత్రి సవిత ఫోన్ లో మాట్లాడి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. విద్యార్థినులు కోలుకున్నారని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని వారు మంత్రికి అధికారులు వివరించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థినులెవరూ అస్వస్థతకు గురికాలేదన్నారు. విద్యార్థినులు పూర్తిగా కోలుకునే వరకూ వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచాలని మంత్రి సూచించారు. వసతి గృహంలో మిగిలిన విద్యార్థినుల గురించి అడిగి తెలుసుకుని, అవసరమైతే వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాతావరణంలో వచ్చిన మార్పుల దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలని బిసి సంక్షేమశాధికారులకు సూచించారు. విద్యార్థులకు కాచి చల్లార్చిన తాగునీటిని, తాజా ఆహారాన్ని మాత్రమే అందించాలని, వసతి గృహాల పరిసరాలను పరిశుభ్రం ఉంచాలని స్పష్టంచేశారు. నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్