ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2026 దరఖాస్తుల గడవును పొడగించినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారీయా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారుల విజ్ఞప్తుల మేరకు పొడిగించినట్లు వెల్లడించారు. డివిజనల్ స్థాయిలో ఈనెల 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.వీటిని పరిశీలించి ప్రతి కేటగిరీలో 1:3 నిష్పత్తిలో ఈనెల 21 నుంచి 23 తుది జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ జాబితాను 24న జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి సమర్పిస్తారని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో దరఖాస్తుల పరిశీలించి 25 నుంచి 30వ తేదీ వరకు ఇంటర్య్వలు నిర్వహిస్తారని తెలిపారు. జిల్లా స్థాయి తుది జాబితాను పాఠశాల విద్యా కార్యాలయానికి ఈ నెల 31న సమర్పిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో వీటిని పరిశీలించి ఆగస్టు 6 నుంచి 10వ తేదీ వరకు ఇంటర్య్వలు నిర్వహిస్తారని తెలిపారు.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల దరఖాస్తు గడువు పొడగింపు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 19, 2026, 10:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)