ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌ పోర్ట్ ప్రారంభం

18 జులై, 2026

cm cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 10:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రధాని చేతుల మీదగా కార్యక్రమం

- సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భోగాపురం ఎయిర్ పోర్టును ఆగస్టు 1వ తేదిన ప్రధానమంత్రి ప్రారంభించనున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని షెడ్యూల్‌ ‌ఖరారైందని తెలిపారు. భోగాపురం విమానశ్రయంపై ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారంగా మారుతుందని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్ పోర్టు కీలకం కానుందన్నారు. దీనివల్ల సామాన్యులు కూడా అనేక రకాలుగా లబ్ది పొందుతారని చెప్పారు. రవాణా మాత్రమే కాకుండా పర్యాటకం, పారిశ్రామికపరంగా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్ర సంస్కృతి, కళలను చాటేలా అత్యంత కళాత్మకంగా ఎయిర్ పోర్టులో ప్రతి విభాగాన్ని తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఎయిర్ పోర్టు ప్రారంభాన్ని ఉత్తరాంధ్రలోని ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు సెలబ్రేట్ చేసుకోవాల్సిన శుభ సందర్భం అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్‌, డిజిపి హరీష్‌ ‌కుమార్‌ గుప్తా, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌ ‌యాదవ్ వి అనిత, అచ్చెన్నాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్