బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఉత్తరాంధ్రకు ‘భోగాపురం’ గ్రోత్‌ ఇంజిన్‌ : సిఎం చంద్రబాబు

6 గంటల క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 12:06 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉత్తరాంధ్రకు గ్రోత్‌ ఇంజిన్‌గా, గ్లోబల్‌ కనెక్టివిటీ కల్పించే లాజిస్టిక్స్‌ కేంద్రంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులతో మంగళవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. విమానాశ్రయంతోపాటు ప్యాసింజర్‌ టెర్మినల్‌, ఏవియేషన్‌ యూనివర్సిటీ, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, ఏవియేషన్‌ హబ్‌ ప్రారంభం కానున్నాయని చెప్పారు. విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలను ప్రజలందరి భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలని, వచ్చే తొమ్మిది రోజులపాటు ఉత్తరాంధ్రలోని ప్రతి ఇంటికీ వేడుకల స్ఫూర్తిని తీసుకెళ్లాలని సూచించారు. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయంతో పరిశ్రమలు, పర్యాటకం, లాజిస్టిక్స్‌, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని తెలిపారు. ఎఐ డేటా సెంటర్లు, అరుదైన ఖనిజాల పరిశ్రమలు వంటి ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చనున్నాయని చెప్పారు. విమానాశ్రయం కోసం భూములిచ్చిన రైతులు, భూ యజమానులను గౌరవిస్తూ వారికి ఒకసారి ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అరకు కాఫీ, ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు, స్థానిక కళారూపాలను ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఘనంగా ప్రదర్శించాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్