- మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం పట్ల పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలివచ్చిన ఉత్తరాంధ్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం, నిర్వహణ కమిటీ సమన్వయంతోనే ఈ కార్యక్రమం ఘనవిజయం సాధించిందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, నిరంతర పర్యవేక్షణ వల్లే భోగాపురం విమానాశ్రయం సాకారమైందని చెప్పారు. విమానాశ్రయం క్రెడిట్ తమదేనంటూ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. విమానాశ్రయ నిర్మాణాన్ని గతంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారే ఇప్పుడు దాని ఘనత తమదని చెప్పుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు. తర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, పర్యాటక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర ప్రాంత దశ, దిశను మార్చే కీలక మౌలిక సదుపాయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నాయని మంత్రి విమర్శించారు.








కామెంట్‌లు (0)