ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

బ్రిక్స్ ఫ్రెండ్‌షిప్ సైక్లింగ్‌తో విశాఖలో సందడి

1 గంట క్రితం

cycle.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 10:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సైక్లింగ్ ఆరోగ్యంతో పాటు కాలుష్య నివారణకు దోహదం: డా. మన్సుఖ్ మాండవియా.

ప్రజాశక్తి, ఎంవిపి కాలనీ : బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన ‘బ్రిక్స్ ఫ్రెండ్‌షిప్ సైక్లింగ్’ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. బ్రిక్స్ దేశాల ప్రతినిధులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సైక్లింగ్ చేశారు. నోవాటెల్ హోటల్ నుంచి సి.హారియర్ వరకు, అక్కడి నుంచి తిరిగి నోవాటెల్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా నిర్వహించిన ఈ ఫ్రెండ్‌షిప్ సైక్లింగ్‌లో బ్రిక్స్ దేశాల ప్రతినిధులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. సైక్లింగ్ ‘ఫిట్ ఇండియా’ ఉద్యమంలో ముఖ్యమైన భాగమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘సండే ఆన్ సైకిల్’ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని మంత్రి తెలిపారు. ఆదివారం దాదాపు 1,800 నగరాల్లో ఈ కార్యక్రమం నిర్వహించగా, సుమారు 50 లక్షల మంది యువత ఇందులో భాగస్వాములయ్యారని వెల్లడించారు. సైక్లింగ్ ఒక అద్భుతమైన వ్యాయామమని, శారీరక దృఢత్వాన్ని పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు కూడా దోహదపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ వారానికి కనీసం ఒకరోజైనా సైక్లింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డా. మాండవియా పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఈ సైకిల్ ర్యాలీలో కేంద్ర సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, బ్రిక్స్ దేశాల ప్రతినిధులు, శాప్ ఎండీ భరణి, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్డీవో దిలీప్ చక్రవర్తి, క్రీడా అధికారి జూన్ గ్యాలియట్, యూసీడీ పీడీ సత్యవేణి, కేంద్ర ప్రభుత్వ అధికారులు, అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు.

65fe9031-f76a-45d1-9488-365b39f88442.jpeg

5b7cae06-5b04-4223-b17b-525c4e17f9ce.jpeg

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్