ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కాకినాడ నర్సింగ్‌ విద్యార్థినుల ఘర్షణపై సీఎం ఆరా

1 గంట క్రితం

students.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 11:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి: ఎస్‌కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో విద్యార్థినుల మధ్య శనివారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. తన ఫోన్‌ పోయిందంటూ మణిపూర్‌కు చెందిన ఓ విద్యార్థిని ఇటీవల సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం తలెత్తింది. ఫోన్‌ దొరికినప్పటికీ గొడవ సద్దుమణగకపోవడంతో ఏపీ, మణిపూర్‌ విద్యార్థినులు పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘర్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్, ఎస్పీ రంగంలోకి దిగి విద్యార్థుల భద్రతకు చర్యలు చేపట్టారు. విద్యార్థినుల వసతి గృహాన్ని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్నా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్