ప్రజాశక్తి-కడప : కడపలోని సీకే దిన్నె మండలం ఎన్టీపీసీ సమీపంలో షేక్ శంషాద్ బేగం అనే మహిళ గొంతు కోసి హత్యకు గురైంది. శీను అనే వ్యక్తి అనుమానంతో ఆమెను హత్య చేసిన అనంతరం తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన శీనును కడప రిమ్స్‌కు తరలించగా పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కడపలో మహిళ దారుణ హత్య
57 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 04, 2026, 11:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)