శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సిజేరియన్లు తగ్గించాలి

2 గంటల క్రితం

doctor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 07:21 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

మాతృమూర్తుల ఆరోగ్యానికి భరోసాగా ఉండాలి

​ ​పాలియేటివ్ కేర్ లో ముందున్న కేరళ ప్రభుత్వ చర్యలపై అధ్యయనం చేయాలి

​వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాతృమూర్తుల ఆరోగ్యానికి భరోసాగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అన్నారు. గర్భందాల్చిన ప్రతి ఒక్క మహిళ వివరాలు తప్పనిసరిగా పోర్టల్‌‌లో నమోదు చేయాలని స్పష్టంచేశారు. దీనివల్ల తల్లితోపాటు బిడ్డకు ఆరోగ్య భద్రత లభిస్తోందని వెల్లడించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో కమిషనర్ చక్రధరబాబుతో కలిసి సురేష్ కుమార్ సీజినల్ వ్యాధులు, పల్స్ పోలియో, హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీ, జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా అమలవుతోన్న పథకాల సమన్వయ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. కొన్ని జిల్లాల్లో గర్భందాల్చిన మహిళల పేర్లు తక్కువగా నమోదు జరగడంపై అధికారులను వివరణ కోరారు. సిజేరియన్ కేసులు తగ్గించేందుకు కూడా కృషి జరగాలని ఆదేశించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్కువ సిజేరియన్‌ ‌కేసులు నమోదుకావడానికి గల కారణాలను ప్రశ్నించారు. సిజేరియన్లు ఏయే పరిస్థితుల్లో చేయాలో గర్భిణుల కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని తెలిపారు. సహేతుకమైన కారణాలు లేకుండా సిజేరియన్లు జరుగుతుంటే సదరు బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో వెనుకాడకూడదని స్పష్టంచేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 62శాతం, ప్రభుత్వాసుపత్రుల్లో 42శాతం చొప్పున సిజేరియన్లు జరుగుతున్నాయని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన 253 మాతృత్వ మరణాలపై ఆడిటింగ్ తప్పకుండా జరగాలని, తద్వారా గుర్తించిన అంశాలపై వైద్యులు, ఇతర సిబ్బందికి అవగాహన కలిపించి మాతృత్వ మరణాల తగ్గుదలకు కృషి చేయాలని కోరారు. కేరళ ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలపై అధ్యయనం చేయాలని, ఎన్జీఓల సహకారాన్ని తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారుల సమన్వయంతో కలసి పనిచేయాలని చెప్పారు. హాట్ స్పాట్స్ గా గుర్తించిన గ్రామాల్లో ప్రత్యేక చర్యలు అవసరమని పేర్కొన్నారు. పల్స్‌ ‌పోలియో 98.70శాతం,హెచ్పీవీ వ్యాక్సిన్ ను 83.67శాతం జరిగినట్లు అధికారులు వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత రాకుండా చూడాలని, అవసరమైన చోట్ల స్థానికంగా కొనుగోలు చేసుకోవాలని కమిషనర్ చక్రధరబాబు సమావేశానికి ముందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆదేశించారు. గర్భిణుల ప్రసవ సమయంలో అధిక రక్తస్రవం, అధిక రక్తపోటు (బిపి) వల్ల మూర్ఛ వంటి సమస్యలు తలెత్తకుండా ఆధునాతన విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గైనకాలజిస్టులు, పిహెచ్‌‌సి మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (సీహెచ్)లకు మంగళగిరిలో రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగిసిందని అంతకుముందు ఒక ప్రకటనలో తెలిపారు. తొలివిడత కింద అనంతపురం, బాపట్ల జిల్లాలకు జరిగిందని, దశలవారీగా మిగిలిన జిల్లాలోని వారికి కూడా శిక్షణ ఇస్తామని ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్