ప్రజాశక్తి-గుత్తి : అనంతపురం జిల్లా గుత్తి మండలం టి.కొత్తపల్లి గ్రామం 67వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మరికల్ మండలం బుడేగాన్ తండాకు చెందిన రవినాయక్(30), గాజుల తండాకు చెందిన లక్ష్మణ్ నాయక్, రవి నాయక్ కలిసి కారులో తాడిపత్రి నుంచి గుత్తి వైపు వస్తుండగా టి.కొత్తపల్లి గ్రామ మలుపు సమీపంలో ముందువైపు వెళుతున్న లారీని వేగంగా ఢీ కొట్టారు. దీంతో మంటలు చెలరేగాయి. కారులోనే డ్రైవర్ రవినాయక్ సజీవ దహనమయ్యారు. లారీని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఢీకొనడం, కారులో డీజిల్ క్యాన్‌లు ఉండడం వల్ల మంటలు వేగంగా వ్యాపించి ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇదే ప్రమాదంలో నెల్లూరు జిల్లా రంగనాయకపేటకు చెందిన లారీ డ్రైవర్ షేక్ నజీర్ బాషా గాయపడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన లక్ష్మణ్ నాయక్, రవి నాయక్ ప్రమాదస్థలి నుంచి పారిపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కారు దగ్ధం...డ్రైవర్ సజీవదహనం !
30 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 30, 2026, 07:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)