ప్రజాశక్తి-కలకడ: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కలకడ ఎస్సై రామాంజనేయులు తెలిపారు. అన్నమయ్య జిల్లా కలకడ మండలం కోన పంచాయతీ పరిధిలోని తిప్పిగారిపల్లి గ్రామానికి చెందిన బడుగు హరీష్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ఆయన మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో తన బాబాయ్ బడుగు శశిధర్‌రెడ్డికి ఫోన్ చేసి, కలకడ నుంచి బస్సులో బెంగళూరులోని కార్యాలయానికి వెళ్తున్నట్లు తెలిపారు. అనంతరం శశిధర్‌రెడ్డి మధ్యాహ్నం హరీష్‌రెడ్డికి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో బెంగళూరులో హరీష్‌రెడ్డి పనిచేస్తున్న కార్యాలయానికి, ఆయన ఉంటున్న పీజీలోని స్నేహితులకు ఫోన్ చేసి ఆరా తీశారు. అయితే హరీష్‌రెడ్డి కార్యాలయానికి గానీ, పీజీకి గానీ రాలేదని వారు తెలిపారు.
దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, బంధువులు, పరిచయస్తుల వద్ద హరీష్‌రెడ్డి ఆచూకీ కోసం వెతికారు. అయినప్పటికీ ఆయన జాడ తెలియకపోవడంతో, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామాంజనేయులు తెలిపారు. హరీష్‌రెడ్డి ఆచూకీ కోసం పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు.







కామెంట్‌లు (0)