సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఉజ్జయినిలో ఉద్రిక్తత

56 నిమిషాల క్రితం

ఉజ్జయినిలో ఉద్రిక్తత
- మసీదులో కొంత భాగం కూల్చివేతపై ఘర్షణలు
- పరిస్థితి అదుపులో వుందన్న అధికారులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 11:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మసీదులో కొంత భాగం కూల్చివేతపై ఘర్షణలు

  • పరిస్థితి అదుపులో వుందన్న అధికారులు

ఉజ్జయిని : రోడ్డు విస్తరణ ప్రాజెక్టు పనుల్లో భాగంగా షాహీ మసీదులో కొంత భాగాన్ని ధ్వంసం చేయాలన్న ప్రతిపాదనపై కొంతమంది భద్రతా సిబ్బందితో ఘర్షణ పడ్డారు. ఇందుకు సంబంధించి ఏడుగురిని అరెస్టు చేయగా, ఐదుగురు కంటెంట్‌ ‌క్రియేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌‌లోని ఉజ్జయినిలో సింహాస్త కుంభమేళా-2028కి సన్నాహాల్లో భాగంగా ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఆదివారం రాత్రి మొదలైన ఈ ఉద్రిక్తతలు సోమవారం ఉదయానికల్లా తీవ్రమయ్యాయి. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జి జరిపారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. మసీదును బలవంతంగా కూలగొట్టేస్తున్నారని వదంతులు వచ్చాయని, దాంతో కొంతమంది పోలీసులతో ఘర్షణ పడుతూ రాళ్ళు విసిరారని ఉజ్జయిని కలెక్టర్‌ ‌రోషన్‌ ‌కుమార్‌ సింగ్‌ తెలిపారు. మసీదులో అవసరమైన భాగాన్ని ముస్లింలే కొంతమంది స్వయంగా తొలగిస్తున్నారని, కానీ ఈలోగా కొందరు దుండగులు ఈ క్రమంలోకి చొరబడి అనవసరమైన రాద్ధాంతం సృష్టించారని తెలిపారు. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని స్వల్పంగా బల ప్రయోగంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారన్నారు. ఈ క్రమంలోకొంతమందికి స్వల్పంగా గాయాలయ్యాయన్నారు. ఉజ్జయినిలోని ఛాత్రి చౌక్‌‌లో గల మసీదులో చాలా స్వల్ప భాగం మాత్రమే రోడ్డు విస్తరణ పనుల కోసం తొలగించాల్సి వచ్చిందని ‌తెలిపారు. ఉజ్జయిని ఎస్‌‌పి ప్రదీప్‌ ‌శర్మ మాట్లాడుతూ, ఉదయం 9గంటల నుండి ఈ ఏరియాలో పనులు సాగుతున్నాయని తెలిపారు. వదంతులు వ్యాప్తి చేసిన వారిని గుర్తించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తప్పుడు సమాచారం ప్రచారం చేసిన ఐదుగురు కంటెంట్‌‌క్రియేటర్లపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఇదిలావుండగా, వదంతులను నమ్మొద్దని ఉజ్జయిని నగర ఖాజీ ఖలీ కురే రెహమన్‌ ‌కోరారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. పరస్పర ఒప్పందం ద్వారా రాత్రే ఈ సమస్య సమసిపోయిందని చెప్పారు. ఎవరూ ఇక్కడకు వచ్చి పరిస్థితులను చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్