సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅమెరికా క్లబ్‌‌లో కాల్పులు

59 నిమిషాల క్రితం

gun-fire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 11:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు

వాషింగ్టన్‌ : అమెరికాలో కాల్పుల ఘటనలు ఆగడం లేదు. తాజాగా మిచిగాన్‌ రాష్ర్టంలోని డెట్రాయిట్‌లో ఒక క్లబ్‌‌లో కాల్పుల ఘటన సంభవించి ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం నివాసాల మధ్యలో ఉండే క్లబ్‌‌లో ఈ కాల్పుల ఘటన జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ సంఘటన జరిగిన మూడు నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్సకు తరలించారు. నిర్ణీత సమయం తరువాత కూడా నడుస్తున్న ఈ క్లబ్‌‌లో కొంత మంది వ్యక్తుల మధ్య ప్రారంభమైన వాగ్వాదం కాల్పులకు దారి తీసిందని డెట్రాయిట్ పోలీస్ చీఫ్ టాడ్ బెట్టిసన్ విలేకరులకు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని, వీరిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని చెప్పారు. అదేవిధంగా ఈ ఘటనలో బాధితులందరూ 20 నుంచి 30 ఏళ్ల వయస్సుల మధ్య ఉన్నవారని చెప్పారు. కాగా, ఆదివారం దీని కంటే ముందు జార్జియాలోని మేకాన్‌లో ఒక పార్కులో జరిగిన కాల్పుల ఘటనలో 12 మంది గాయపడ్డారు. పుట్టిన రోజు వేడుకల్లో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్