రెండో వన్డేలోనూ ఆసీస్‌పై దక్షిణాఫ్రికా గెలుపు
సిరీస్ కైవసం
జొహన్నెస్‌బర్గ్: ఆస్ర్టేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ దక్షిణాఫ్రికా గెలిచి మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ‘ది వాండెరర్స్ స్టేడియం’లో ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారీస్కోర్లు నమోదయ్యా యి. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 32 పరుగుల పరుగుల తేడాతో గెలిచి 2-0తో సిరీస్‌ను చేజిక్కించుకుంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ బవుమా(103), డేవిడ్ మిల్లర్(142) శతకాలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 365పరుగుల భారీస్కోర్ చేసింది. ఆస్ర్టేలియా బౌలర్లు ఎడ్వార్డ్‌కు ఐదు, హేజిల్‌వుడ్‌కు మూడు, బెన్నెట్‌కు ఒక వికెట్ దక్కాయి. భారీ ఛేదనలో ఆసీస్ ఓపెనర్, కెప్టెన్ మిఛెల్ మార్ష్(84), హెడ్(84) అర్ధసెంచరీ లతో రాణించి తొలి వికెట్‌కు 16ఓవర్లలో 130పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ ఔటయ్యాక ఆసీస్ బ్యాటర్లు భరతం దక్షిణాఫ్రికా బౌలర్లు పట్టారు. కనోలే(10), క్యారీ(17), రెన్‌షా(32), గ్రీన్(17) స్వల్ప స్కోర్లకే పెవీలియన్‌కు చేరారు. కానీ బార్ట్‌లెట్(50) అర్ధసెంచరీతో రాణించినా.. ఆసీస్‌ను గెలుపుబాట పట్టించలేకపోయారు. దీంతో ఆస్ర్టేలియా 49.5ఓవర్లలో 333పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్లు విలియమ్స్‌కఉ మూడు, యాన్సెన్, మహరాజ్, ఫోర్చూన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ డేవిడ్ మిల్లర్‌కు దక్కింది.








కామెంట్‌లు (0)