సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionWPL 2027 retentions:స్టార్‌ ప్లేయర్లకే ప్రాధాన్యత

1 గంట క్రితం

wpl.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 11:25 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • అక్టోబర్‌ 28న కొచ్చిలో మినీ వేలం

  • మహిళల ప్రీమియర్ లీగ్ కసరత్తు ప్రారంభం

ముంబయి: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్‌) ఐదో సీజన్‌ మినీ వేలానికి కసరత్తు ప్రారంభమైంది. అక్టోబర్‌ 28న కొచ్చి వేదికగా జరిగే వేలానికి ముందు ఆయా ప్రాంచైజీలు తమవద్ద నిలుపుకున్న, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలను సోమవారం ప్రకటించాయి. ఐదు ఫ్రాంచైజీలు నిలకడగా రాణిస్తున్న కీలక ప్లేయర్లను రిటైన్ చేసుకొని.. ఫామ్‌లో లేని ఆటగాళ్లను విడుదల చేశాయి. ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు సోమవారం తమ రిటెన్షన్ జాబితా ప్రకటించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన సహా 12 మందిని రిటైన్ చేసుకుంది. మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మాత్రం.. ఆరుగురు భారత క్రికెటర్లను, ఐదుగురి విదేశీయులను మాత్రమే అట్టిపెట్టుకుంది. వరసగా రెండు ఫైనల్స్‌లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ విషయంలో ఆచితూచి వ్యవహరించింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్, షఫాలి వర్మ, శ్రీ చరణి, నందిని శర్మ సహా.. మరో మంది భారత స్టార్లు, నలుగురు విదేశీ స్టార్లను అట్టిపెట్టుకుంది. యూపీ వారియర్స్ ఫ్రాంచైజీ 11 మందిని రిటైన్ చేసుకోగా.. గుజరాత్ జెయింట్స్ అత్యధికంగా 14 మందిని కొనసాగించింది. వచ్చే ఏడాది జనవరి 14న డబ్ల్యూపీఎల్ ఐదో సీజన్ ప్రారంభం కానుంది.

ఫ్రాంచైజీలు నిలుపుకున్న ప్లేయర్లు వీరే...

ముంబై ఇండియన్స్ : హర్మన్‌ప్రీత్(కెప్టెన్), అమన్‌జోత్, రహిలా ఫిరదౌస్, సజీవన సంజన, వైష్ణవి శర్మ, సంస్కృతి గుప్తా. విదేశీ ప్లేయర్లు: షబ్నం ఇస్మాయిల్, అమేలియా కేర్, సీవర్ బ్రంట్, నికోల కారీ, హేలీ మాథ్యూస్,

గుజరాత్ జెయింట్స్ : అనుష్క శర్మ, భారతి ఫుల్‌మాలి, కనికా ఆహుజా, తనూజ కన్వర్, రాజేశ్వరి గైక్వాడ్, హ్యాపీ కుమారి, కష్వీ గౌతమ్, రేణుకా సింగ్, యస్తికా భాటియా. విదేశీ ప్లేయర్లు: బేత్ మూనీ, జార్జియా వరేహం, అష్లే గార్డ్‌నర్, కిమ్ గార్త్, సోఫీ డెవినె,

యూపి వారియర్స్: దీప్తి శర్మ, హర్లీన్ డియోల్, క్రాంతి గౌడ్, ప్రతీక రావల్, సిమ్రన్ షేక్, శిఖా పాండే, షిప్రా గిరి, విదేశీ ప్లేయర్లు: మేగ్ లానింగ్, ఫొబే లిచ్‌ఫీల్డ్, సోఫీ ఎకిల్‌స్టోన్, తారా నోరిస్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: మంధాన(కెప్టెన్), రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సయాలి సత్ఘరే, ప్రేమా రావత్, రీచా ఘోష్, ప్రత్యూష కుమార్ అరుంధతి రెడ్డి. విదేశీ ప్లేయర్లు: లారెన్ బెల్, ఎలీసా పెర్రీ, నడినే డీక్లెర్క్, జార్జియా వరేహం,

ఢిల్లీ క్యాపిటల్స్‌: జోమీమా రోడ్రిగ్స్‌(కెప్టెన్), షఫాలి వర్మ, శ్రీ చరణి, మమతా మదివల, నందిని శర్మ, నిక్కీ ప్రసాద్, దీయ యాదవ్, మిన్ను మని. విదేశీ ప్లేయర్లు: అనాబెల్ సథర్‌లాండ్, లారా వొల్వార్డ్త్, చినొల్లె హెన్రీ, మరిజానే కాప్.


​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్