ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

డిఎస్‌‌సి అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలి : బొత్స

1 గంట క్రితం

botsa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 11:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : డిఎస్‌‌సిలో అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని వైసిపి శాసనమండలి సభాపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం విజయనగరంలోని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిఎస్‌‌సి ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయని, డిఎస్‌‌సి క్రీడా కోటాలో 447 జిఒ విడుదల చేసి నచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చేశారని ఆరోపించారు. ఈ అక్రమాలకు సంబంధిత రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. భోగాపురం విమానాశ్రయానికి గత టిడిపి ప్రభుత్వ హయాంలో 15 వేల ఎకరాలు సేకరించాలని చూశారని, వైసిపి ప్రభుత్వం వచ్చాక 2,700 ఎకరాలు మాత్రమే సేకరించామని గుర్తు చేశారు. అందులో 2,200 ఎకరాలను విమానాశ్రయానికి కేటాయించి మిగిలిన 500 ఎకరాలను ప్రభుత్వం వేరుగా ఉంచిందని తెలిపారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణంలో లోపాలను, టిడిపి కూటమి ప్రభుత్వ నిర్వాకాలను ఎయిర్‌‌పోర్టు ప్రారంభం తర్వాత సభ పెట్టి తెలియజేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌‌మెంట్ బకాయిలు విడుదల చేయనందున మూడున్నర లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, రూ.10 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరంలో ఉన్న జెఎన్‌‌టియు-జివి, సిటియు వార్షికోత్సవాలను విశాఖపట్నంలో నిర్వహించడం దారుణమన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్