శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఖరీఫ్‌ సీజన్‌ పెండింగ్‌ బీమా బకాయిల విడుదలకు కేంద్రం అనుమతి

9 గంటల క్రితం

Centre approves release of pending Kharif season insurance dues.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 04:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో చర్చలు ఫలించినట్లు ఎపి మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. 2024 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన పంటల బీమా పెండింగ్‌ బకాయిల విడుదలకు మార్గం సుగమమైందన్నారు. గత ప్రభుత్వం హయాంలో పెండింగ్‌లో ఉన్న 2024-ఖరీఫ్‌ పంటల బీమా బకాయిలు విడుదల చేసేందుకు కేంద్రం అనుమతినిచ్చిందన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ వైఫల్యాలతో వ్యవసాయ శాఖలో పేరుకుపోయిన సమస్యలకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపుతోందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతుల పక్షాన స్పందించి బీమా బకాయిల విడుదలకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్