బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘అనంత’లో చైన్ స్నాచర్ల హల్‌‌చల్‌

9 గంటల క్రితం

‘అనంత’లో చైన్ స్నాచర్ల హల్‌‌చల్‌
- ఒకే రోజు నాలుగు చోట్ల దొంగతనాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 09:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఒకే రోజు నాలుగు చోట్ల దొంగతనాలు

ప్రజాశక్తి - అనంతపురం రూరల్‌ : అనంతపురం జిల్లా కేంద్రం, పరిసర గ్రామాల్లో చైన్ స్నాచర్లు మంగళవారం ఉదయం రెచ్చిపోయారు. ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని క్షణాల్లో వారి మెడలోని బంగారు నగలను ఎత్తుకెళ్లడం కలకలం రేపింది. ఒకే రోజు ఏకంగా నాలుగు చోట్ల మహిళల మెడలోనుంచి బంగారు గొలుసులను ఎత్తుకెళ్లారు. బాధితుల కథనం ప్రకారం... అనంతపురంలోని సాయినగర్‌లో శ్యామలాదేవి అనే మహిళ కూరగాయల కొనేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. పల్సర్ బైక్‌లో వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు చైన్ లాక్కొని ఉడాయించారు. ఇదే తరహాలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఒక మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లారు. వినాయకనగర్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న విజయ అనే మహిళ మెడలోనుంచి 2.5 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. బుక్కరాయసముద్రం మండల పరిధిలో కిరాణా కొట్టు ముందు శుభ్రం చేస్తున్న లక్ష్మి అనే మహిళ మెడ నుంచి దొంగలు బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటనలపై సమాచారం అందుకున్న పోలీసులు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్