శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచంద్రబాబు మోసం మరోసారి బట్ట బయలు

8 గంటల క్రితం

చంద్రబాబు మోసం మరోసారి బట్ట బయలు
- నిలబడదని తెలిసినా రిజర్వేషన్ల జిఒ ఇవ్వడం అంటే ప్రజలను మోసగించడమే
- ఎన్నికలు ఎప్పుడు పెట్టినా మేము సిద్ధమే : బొత్స image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 08:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • నిలబడదని తెలిసినా రిజర్వేషన్ల జిఒ ఇవ్వడం ప్రజలను మోసగించడమే

  • ఎన్నికలు ఎప్పుడు పెట్టినా మేము సిద్ధమే : బొత్స

ప్రజాశక్తి - విజయనగరం టౌన్ : బిసి రిజర్వేషన్ల అమలు విషయంలో చంద్రబాబు నాయుడు బిసిలకు చేసిన మోసం, దగా, దుర్బుద్ధి మరోసారి బయట పడిందని, రిజర్వేషన్లు కోర్టు పరిధిలో నిలబడవని తెలిసి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నించారని వైసిపి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. వైసిపి జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 50 శాతానికి బిసి రిజర్వేషన్లు మించకూడదని చెప్పిన తర్వాత మళ్లీ పార్టీ తరఫున 34 శాతం అమలు చేస్తామని చెప్పడం ఆయన మాయ మాటలకు నిదర్శనమని విమర్శించారు. 46 శాతాన్ని గత వైసిపి ప్రభుత్వంలో అమలు చేశామని, 46 నుంచి 60 శాతం వరకు కొన్ని పదవుల్లో బిసి రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో కారం పొడితో విద్యార్థులు టిఫిన్ తింటున్నట్లు అధికార పార్టీ పత్రికలు రాశాయని, దీనికి సమాధానం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చెప్పాలన్నారు. ఉద్యోగులు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారన్నారని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఏమైందని, సున్నా వడ్డీ ఇచ్చారా అని ప్రశ్నించారు. రాజ్యాంగ సవరణ కోసం బిసిలు డిమాండ్ చేయాలని కోరారు. సమావేశంలో వైసిపి జిల్లా అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, నియోజకవర్గ ఇన్ ఛార్జి గదల సన్యాసినాయుడు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్