ఈ నెలలో దసరా, ఆ తర్వాత నెలలో దీపావళి పండుగలు వస్తున్నాయి. ఈ సందర్భంగా పేద, మధ్యతరగతి ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఎక్కువగా ప్రయాణించేది రైళ్లలోనే. ఇప్పటీకే అన్ని రైళ్లలోనూ రిజర్వేషన్లు నిండుకుని చాంతాడంత నిరీక్షణ జాబితా చూపిస్తున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సాధారణ బోగీలు రెండు మాత్రమే అందుబాటులో ఉండటంతో ప్రయాణికులు చాలా కిక్కిరిసిన పరిస్థితిలో ప్రయాణం చేయవలసి వస్తుంది. 'ప్రత్యేక రైళ్లు' ప్రకటనలకే తప్ప సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేని విధంగా రేట్లు ఉంటున్నాయి. కాబట్టి ప్రస్తుతం తిరుగుతున్న అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రాబోయే పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకీ అనుగుణంగా సాధారణ బోగీల సంఖ్యను పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలు ప్రయాణించేందుకు అవకాశం కల్పించాలి. రైల్వే భద్రతకు పెద్దపీట వేయడంతో పాటు వాటిలో దొంగతనాలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.
- డి.వి.ఆర్, ఊరదాళ్లపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా.







కామెంట్‌లు (0)