మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరిజ‌ర్వేష‌న్లు త‌గ్గ‌డానికి చంద్ర‌బాబే కార‌ణం

09 అక్టోబర్, 2026

MP Gorantla Madhav.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 08:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మాజీ ఎంపి గోరంట్ల మాధ‌వ్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజకీయ లబ్ధి కోసం ప్ర‌కాశం జిల్లా కొండ‌పిలో జ‌రిగిన స‌భ‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు.. బిసిల రిజర్వేషన్ల అంశంలో వైసిపిపై పచ్చి అబద్ధాలతో బురదజల్లే ప్ర‌య‌త్నం చేశారని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్‌ విమర్శించారు. వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌‌టి రామారావు, ఆ తర్వాత వైఎస్‌ జగన్ ప్రభుత్వాల‌దేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబుకు నిజంగా బిసిలపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి చట్ట సవరణ చేయించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పిస్తారో బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్