ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

భోగాపురం ఎయిర్ పోర్టులోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ

01 ఆగస్టు, 2026

sajjala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 09:33 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎర్రబస్సు పేరుతో జగన్ పై అబద్ధాల ప్రచారం

- జగన్ అనని మాటల్ని అన్నట్లు వక్రీకరణలు

- వైసిపి రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో చంద్రబాబు మరోసారి తన క్రెడిట్ చోరీని బయటపెట్టుకున్నారని వైసిపి రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. శనివారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో 80 శాతం పనులు పూర్తి చేస్తే, రెండేళ్లలో 20 శాతం పనులు చేసి, గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. క్రెడిట్ చోరీతో సరిపెట్టుకోకుండా తిరిగి వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పై దుష్ప్రచారాలకు కూటమి నేతలు తెరలేపడాన్ని మండిపడ్డారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అనని మాటల్ని అన్నట్లుగా చూపించి విమర్శలకు దిగడం కూటమి నేతల దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెప్తారని చంద్రబాబు తెలుసుకోవాలని హితవు పలికారు. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభించడం మంచిదేనని, నెల రోజుల నుంచీ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓ అబద్దపు ప్రచారం చేశారన్నారు. చంద్రబాబుకు సహజంగానే చెప్పుకోవడానికి ఏమీ ఉండదని. ముందు జరిగింది ఏదైనా ఉంటే తన ఖాతాలో వేసుకుంటారని విమర్శించారు. హైదరాబాద్ నిర్మించానన్న ప్రచారం నుంచి మొదలుపెడితే భోగాపురం ఎయిర్ పోర్టు వరకూ ఇదే పరిస్ధితి అని తెలిపారు. విభజన తర్వాత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల క్రెడిట్ చోరీ చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని విమర్శించారు. ఇప్పటికే కడప స్టీల్ క్రెడిట్ చోరీ,ఇప్పుడు భోగాపురం విషయంలోనూ క్రెడిట్ చోరీ చేసుకున్నా ఫర్వాలేదు కానీ విషప్రచారాలకు దిగడమే అభ్యంతరకరమన్నారు.2023లో భోగాపురం పనులు మొదలుపెట్టి తర్వాత ఏడాది ఎన్నికలు వచ్చే నాటికి 80 శాతం పనులు పూర్తి చేశామన్నారు. రూ.12వందల కోట్లతో భూసేకరణతో పాటు పునరావాసం జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారన్నారు. ఆ తర్వాత మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేయడానికి చంద్రబాబుకు రెండేళ్లు పట్టిందని విమర్శించారు.వైజాగ్ లో చంద్రబాబు ఏం చేశారు ? 30 వేల కోట్ల విలువ చేసే భూములు 99 పైసలకే అప్పనంగా దోచిపెట్టారని ఆరోపించారు.లోకేష్ తోడల్లుడు అయిన ఎంపికే రూ.5 వేల కోట్ల భూమి అప్పనంగా ఇచ్చేశారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్