శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పార్టీ పేరును మార్చుకోండి : కవితకు ఈసి ఆదేశం

2 గంటల క్రితం

Change party name: EC's directive to Kavitha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 11:38 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన నూతన రాజకీయ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’ పేరు పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమె కొత్తగా పెట్టబోయే పార్టీకి 'తెలంగాణ రక్షణ సేన' (TRS) గా నామకరణం చేస్తూ రిజిస్ట్రేషన్ కోసం ఈసి కి దరఖాస్తు చేసుకున్న సంగతి విదితమే. అయితే ... ఈ పేరును మార్చుకోవాలని స్పష్టం చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) కవితకు అధికారికంగా లేఖ రాశారు. రాబోయే 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను తమకు సమర్పించకపోతే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును పూర్తిగా మూసివేస్తామని ఈసి గడువు విధించినట్లు సమాచారం.


గతంలో కెసిఆర్ నేతృత్వంలోని 'తెలంగాణ రాష్ట్ర సమితి' పార్టీ కూడా 'టిఆర్ఎస్' (TRS) అనే సంక్షిప్త నామంతోనే గుర్తింపు పొందింది. ఆ తర్వాత దానిని భారత్ రాష్ట్ర సమితి (BRS)గా మార్చారు. ఇప్పుడు కవిత మళ్లీ అదే సంక్షిప్త నామం (TRS) వచ్చేలా 'తెలంగాణ రక్షణ సేన' అని పేరు పెట్టడం పై ప్రజల నుండి, వివిధ వర్గాల నుండి ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున అభ్యంతరాలు, ఫిర్యాదులు అందాయి. పాత పార్టీ పేరును, సెంటిమెంట్‌ను తలపించేలా ఈ కొత్త పేరు ఉండటం వల్ల ఓటర్లలో తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశం ఉందని ఈసి అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ పేరును కొనసాగించడం కుదరదని స్పష్టం చేస్తూ .... కవితకు పంపిన లేఖలో ఈసి ఈ విషయాలను పొందుపరిచినట్లు తెలుస్తుంది. అయితే ఈసి లేఖకు తెలంగాణ రక్షణ సేన సమాధానాలు పంపింది. కేవలం రెండు అభ్యంతరాలను మాత్రమే ఈసి తమకు పంపినట్లు వెల్లడించింది. మిగతా అభ్యంతరాలు చెప్పకుండా ప్రత్యామ్నాయ పేర్లు ఎలా అడుగుతారని టిఆర్‌ఎస్‌ ప్రశ్నించింది. పార్టీ పేరు అంశంలో అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేసింది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్