మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మంత్రివర్గ నిర్ణయాలపై హర్షం

10 జులై, 2026

farooq
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 10:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మంత్రులు ఫరూక్, బాలాంజనేయస్వామి

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)చట్టం కింద నమోదయ్యే కేసుల విచారణకు విశాఖలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించడ పట్ల రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో సిఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలోన్యాయ శాఖకు సంబంధించి రెండు కీలకమైన ప్రతిపాదనలకు ఆమోదం పొందాయని తెలిపారు. హైకోర్టులో "రిజిస్ట్రార్" ( కోర్టు కేస్ అండ్ మేనేజ్మెంట్)పోస్టు సృష్టికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నారు. కొత్త పోస్టు ఏర్పాటుతో జిల్లా న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులను తగ్గించేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.సాంఘిక సంక్షేమ ఆధ్వర్యంలో మూడు ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీబాల వీరాంజనేయస్వామి సిఎంచంద్రబాబు, సహచర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా మధురవాడ, గుంటూరు జిల్లా తాడికొండ, తిరుపతి జిల్లా కోటలోఈ సెంటర్లను ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్