ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముఖ్యమంత్రిది ఈవెంట్ మేనేజ్‌మెంట్‌

1 రోజు క్రితం

kannababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 07:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మాజీ మంత్రి కురసాల కన్నబాబు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: రాయలసీమ జిల్లాలన్నీ తీవ్ర దుర్భిక్షంలో కూరుకుపోయి రైతాంగం అల్లాడుతుంటే వారిని ఆదుకునే ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించకుండా సిఎం చంద్రబాబు ‘రైజింగ్ రాయలసీమ లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్’ పేరిట సరికొత్త ఈవెంట్ మేనేజ్‌మెంట్ విన్యాసాలు మొదలుపెట్టారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర నిబంధనల ప్రకారం ఆగస్టులోనే చేయాల్సిన కరువు ప్రకటనను అక్టోబరు వరకు తొక్కిపెట్టి, గతంలో గాల్లో కలిసిపోయిన లాక్‌‌హీడ్, బుల్లెట్ ట్రైన్, హైపర్‌లూప్ లాంటి అబద్ధాల తరహాలోనే ఇప్పుడు మదనపల్లెలో ‘రైజింగ్ రాయలసీమ లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్’ పేరిట చంద్రబాబు సరికొత్త ఈవెంట్ మేనేజ్‌మెంట్ విన్యాసాలు మొదలుపెట్టారని ఆరోపించారు. 2026-27 బడ్జెట్‌లో ఉద్యాన శాఖకు కేవలం రూ.1,123 కోట్లు కేటాయించగా, అందులో ఈ హబ్‌కు పెట్టింది రూ.200 కోట్లు మాత్రమేనని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్