వైద్య పరిశోధన నిమిత్తం భౌతికకాయం అప్పగింత
ప్రజాశక్తి - హైదరాబాద్ : సిఐటియు ప్రముఖ నాయకులు, గవర్నమెంట్ ప్రెస్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపకులు పసువులేటి వెంకటేశ్వర రావు (92) సోమవారం రాత్రి 10.30 గంటలకు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రక్‌లో నివసిస్తున్న ఆయన సోమవారం అనారోగ్యంతో బాధపడుతుండగా స్టార్ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన కోరిక మేరకు భౌతిక కాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తం అప్పగించేందుకు అంగీకారం తెలిపినట్లు కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. బంధు మిత్రులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని గురువారం వరకు హైదరాబాద్ సిపిఎం సెంట్రల్ కార్యాలయంలో ఉంచనున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని గాంధీ ఆస్పత్రికి, కార్నియాలను వాసన్ ఐ బ్యాంక్ వారికి, చర్మాన్ని ఉస్మానియా ఆస్పత్రి స్కిన్ బ్యాంక్ వారికి అప్పగిస్తామని ఆయన కుమార్తెలు జనీల, సుశీల, కుమారుడు అశోక్, కుటుంబ సభ్యులు తెలిపారు.








కామెంట్‌లు (0)